బీఎస్‌ఎఫ్‌లో 1072 పోస్టులు

363

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)
కమ్యూనికేషన్ విభాగంలో 1072 పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖా-స్తులను ఆహ్వానిస్తున్నది.

1072 Jobs in BSF
1072 Jobs in BSF

పోస్టు: హెడ్ కానిస్టేబుల్
మొత్తం పోస్టుల సంఖ్య – 1072
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)-300 ఖాళీలు
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్)-772 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి మెట్రి-క్యులేషన్ లేదా తత్సమాన పరీక్షతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జె-క్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమా-ణాలు కలిగి ఉండాలి.
వయస్సు: 2019, జూన్ 12 నాటికి 18 – 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీ-సీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా
మొదటి దశ-ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్
రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు-200 మార్కు-లుకుగాను మూడు గంటల సమయాన్ని కేటా-యించారు.
ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ అండ్ జన-రల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబెక్టుల నుంచి ప్రశ్నలిస్తారు.
నెగెటివ్ మార్కిగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధా-నానికి 1/2 లేదా 0.50 కోత విధిస్తారు.
రెండో దశ-పీఎస్‌టీ/పీఈటీ, మూడో దశలో
డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది.
పే స్కేల్: రూ. 25,500 -81,100/-
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
(ఎస్సీ/ఎస్టీ, బీఎస్‌ఎఫ్ ఉద్యోగులు, మహిళా అభ్య-ర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 14
చివరితేదీ: జూన్ 12
వెబ్‌సైట్: bsf.nic.in