ఐడీబీఐలో 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

-

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) పీజీ డిప్లొమా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు ద్వారా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 600 (జనరల్-273, ఈడబ్ల్యూ-ఎస్-30, ఓబీసీ-162, ఎస్సీ-90, ఎస్టీ-45, పీహె-చ్‌సీ-24)

కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
ఈ కోర్సును ఐడీబీఐ, మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ సంయుక్తంగా నిర్వహి స్తున్నాయి.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత

వయస్సు: 2019 జూన్ 1 నాటికి కనిష్ఠంగా 21 ఏండ్లు, గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/-ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ-లకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


పే స్కేల్: మొదటి తొమ్మిది నెలలకు రూ. 2500/-(ట్రెయినింగ్ పీరియడ్), ఇంటర్న్‌షిప్ పీరి-యడ్‌లో మూడు నెలలకు రూ. 10,000/-, స్టయిఫండ్ చెల్లిస్తారు. ఏడాది కోర్సును విజయవం-తంగా పూర్తి చేసిన అభ్యర్థులను అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) హోదాలో పే స్కేల్ రూ. 23,700-42,020/- ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: రూ. 700/-
(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 150/-)
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్ష కేవలం ఇంగ్లిష్/హిందీలో మాత్రమే ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్షలో ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులను తగ్గిస్తారు.

శిక్షణ కేంద్రం: మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరు
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 94 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
పరీక్ష తేదీ: జూలై 21
వెబ్‌సైట్: IDBI Bank

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version