– నవంబర్ 1న గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షకు పైగా గ్రామవాలంటీర్ పోస్టులను భర్తీ చేశారు. అయితే రాష్ట్రంలో మిగిలిపోయిన 9,674 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబరు 1న జిల్లాల వారీగా ప్రకటన జారీ చేసి నవంబరు 30లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.
డిసెంబరు 1 నుంచి కొత్తగా ఎంపికయ్యే వాలంటీర్లు విధులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు అక్టోబరు 26న ఉత్తర్వులిచ్చింది. 2019 నవంబరు 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్లు దాటని పదో తరగతి ఉత్తీర్ణులంతా వాలంటీరు పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. నిరుద్యోగ యువతకు మరోసారి సువర్ణావకాశం దక్కింది.
– కేశవ