ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్, షెడ్యూల్ వివరాలు ఇవే..!

-

మీరు ఈసారి ఇంటర్ పరీక్షలు రాస్తున్నారా..? అయితే హాల్ టికెట్స్ ని డౌన్ లోడ్ ఇలా ఈజీగా చేసుకోండి. ఏపీ లో మే 6వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యం లో విద్యార్థులకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల హాల్‌ టికెట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ https://jnanabhumi.ap.gov.in/ లో అప్ లోడ్ చేయడం జరిగింది.

 

సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి తమ హాల్‌ టికెట్లు విద్యార్థులు తీసుకోవాలని అధికారులు చెప్పారు. పరీక్ష వ్రాయాలంటే హాల్ టికెట్ తప్పని సరి. కనుక పరీక్ష కి హాజరయ్యే ప్రతీ ఒక్కరు కూడా హాల్ టికెట్ ని తప్పక తీసుకు రావాలి. ఇక షెడ్యూల్ వివరాలను చూస్తే..

ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ :

మే 6 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 9- ఇంగ్లీష్ పేపర్-1
మే 11- మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
మే 13- మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మే 16- ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మే 18- కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1
మే 23- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1

సెకండ్ ఇయర్ షెడ్యూల్ :

మే 7- సెకండ్ లాంగ్వేష్ పేపర్-II
మే 10- ఇంగ్లిష్ పేపర్-II
మే 12- మ్యాథ్స్ పేపర్-II-A
మే 14- మ్యాథ్స్ పేపర్-II-B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
మే 17- ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
మే 19- కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II , సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
మే 21- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, మ్యాథ్స్ పేపర్-II
మే 24- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II.

Read more RELATED
Recommended to you

Latest news