గత ప్రభుత్వాల వైఫల్యాలకు నిదర్శనమే ఈ రోడ్లు : మంత్రి ముత్యాల నాయుడు

-

ఇటీవల ఏపీ సీఎం జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. అయితే మంత్రి పదవులు చేపట్టిన నేతలు తమదైన శైలిలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం గ్రామాల్లోని 9227 కిలో మీటర్ల లింక్ రోడ్లు అభివృధ్ది చేయనున్నామన్నారు. దీనికోసం ఏఎంసీ నిధులు ఒక వెయ్యి 70 కోట్ల రూపాయలతో పాటు బ్యాంక్ లింకేజి నిధులతో ఈ రోడ్ల అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

అప్పు చేసే పేద‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు అందిస్తున్నాం.. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు

గత ప్రభుత్వం గ్రామాల్లో లింక్ రోడ్ల అభివృద్ధి విస్మరించిందని, గత ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమే మరమ్మతులకు నోచుకోని రోడ్లను చూస్తే అర్థమవుతుందన్నారు. దీనితో ఈ రెండేళ్లలో కురిసిన వర్షాలకు చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ విషయం గమనించిన ముఖ్యమంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారని ఆయన వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా 7.5 మీటర్ల వెడల్పుతో రోడ్లను అభివృద్ధి చేయనున్నామని, వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేస్తామన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news