బంఫ‌ర్ ఆఫ‌ర్.. ఎగ్జామ్స్ లేకుండానే బ్యాంకు ఉద్యోగాలు..!?

-

బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంకులో మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు, కొత్త జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సైతం శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది ఐడీబీఐ. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు 7 జనవరి 2021న లేదా అంతకు ముందులోగా idbibank.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది . ఈ 134 ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు, అందులో 62 మేనేజర్ , 52 ఎజిఎం , 11 డిజిఎం, 9 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయని తెలిపింది .వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డీజీఎం పోస్టుకు 55 శాతం మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. ఏజీఎం , మేనేజర్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. లేదా ఎంసీఏ పాస్ కావాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా సైబర్ క్రైమ్‌ లాంటి క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

ప్రిలిమిన‌రీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్య‌ర్థుల త‌దుప‌రి ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఆన్‌లైన్‌లో పంపించిన ద‌ర‌ఖాస్తుల్లోని విద్యార్హ‌త‌లు, అనుభ‌వం, ఇత‌ర వివ‌రాల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేసిన వారిని గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది…ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా చివరి ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. దీన్ని 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు . దీనిలో జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు 50, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడ‌బ్ల్యూడీల‌కు 45 క‌నీస అర్హ‌త మార్కులుగా నిర్ణయిస్తారు . జీడీ, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్య‌ర్థుల‌కు బ్యాంక్ నిబంధ‌న‌ల ప్ర‌కారం మెడిక‌ల్ టెస్ నిర్వహిస్తారు .

Read more RELATED
Recommended to you

Latest news