తెలుగు ప్రేక్షకుల ఆకలి తీర్చిన సోలో బ్రతుకే సో బెటరు.. ఒక్కరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

-

కరోనా మహమ్మారి వచ్చి తొమ్మిది నెలల పాటు థియేటర్లన్నింటినీ మూసివేసింది. ఆ కారణంగా సినిమా ప్రేమికులైన తెలుగు ప్రేక్షకులు ఓటీటీ ద్వారా విడుదలైన సినిమాలనే చూస్తూ వచ్చారు. ఎంత ఓటీటీ అయినా సినిమా అనేది థియేటర్లో చూస్తేనే కిక్కు. తమ గదిలో ఒంటరిగా సినిమా చూడడానికి, సినిమా హాల్లో నలుగురి మధ్య సినిమా చూడడానికి చాలా తేడా ఉంది. అందుకే థియేటర్లలో సినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఉత్సాహం చూపించారు. ఆ ఉత్సాహం సాయి ధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో పూర్తిగా అర్థమైంది.

కరోనా నియమ నిబంధనల మధ్య కేవలం యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుస్తున్న థియేటర్లలో విడుదలైన సోలో బ్రతుకే సో బెటరు సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. విడుదలైన మొదటిరోజు థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి బాగా కనిపించింది. ఒక్కరోజులో సోలో బ్రతుకే సో బెటరు చిత్రానికి 4.70కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news