బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీలు.. వివరాలు మీకోసం..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ఒక జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. దీనిలో మొత్తం 376 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 12 పోస్టులు వున్నాయి.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అదే విధంగా బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల లోపు అనుభవం ఉండాలి. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 9 చివరి తేదీ. పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు వచ్చేసి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100. సీనియర్ రిలేషన్ షిప్ మ్యానేజర్ పోస్టులు మరియు ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు వున్నాయి. మరిన్ని వివరాలని నోటిఫికేషన్ లో చూడచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
ఆ తరవాత Current Opportunities క్లిక్ చేస్తే సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ నోటిఫికేషన్స్ వేర్వేరుగా ఉంటాయి గమనించండి.
ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మిగిన డీటెయిల్స్ ని నింపండి.
ఆ తరవాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
ఫైనల్ గా ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.