టీఆర్ఎస్ కు బిగ్ షాక్… పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టు రామ చంద్రరావు రాజీనామా చేస్తు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గులాబీ బాస్‌, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కు కూడా గట్టు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. తాను ఆశించిన స్థాయిలో పార్టీలో రాణించలేకపోయాను… కేసీఆర్‌ అభిమానం పొందడంలో గుర్తింపు తెచ్చు కోవడంలో విఫలమయ్యాను.

ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని నేను భావించాను. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను ఆమోదిస్తారని కేసీఆర్‌ గారిని కోరుతున్నారు. ఇన్ని రోజులు తనకు అన్ని బాధ్యతలు అప్పగించినందుకు గానూ పార్టీ నాయకత్వానికి ధన్య వాదాలు అంటూ లేఖ విడుదల చేశారు. అయితే.. తన భవిష్యత్తు కార్యచరణను మాత్రం గట్టు రామచంద్రరావు చెప్పాలేదు. అయితే… రామచంద్రరావు రాజీనామా పై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.