సీబీఎస్ఈ 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు ఆన్లైన్ పద్దతిలో నిర్వహించాలి: బోర్డ్..!

-

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE సోమవారం నాడు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని.. పాఠశాలలు ప్రాక్టికల్స్ లేదా ఇంటర్నల్ అసెస్మెంట్లని కండక్ట్ చేయమని చెప్పింది.

దీనితో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి తాలూకు ఫలితాలు జూన్ 28వ తేదీన వస్తాయి. ఏ పాఠశాలలు అయితే ప్రాక్టికల్స్ లేదా ఇంటర్నల్ ఎసెస్మెంట్ నిర్వహించ లేదో ఆ పాఠశాలలని ఆన్లైన్ మోడ్ ద్వారా నిర్వహించమని ఒక సర్క్యులర్ బోర్డు విడుదల చేసింది.

ఏ ప్రాక్టికల్స్ మరియు సబ్జెక్ట్స్ కి ఎక్స్టర్నల్ ఎవాల్యుయేటర్ కావాలో ఆ ఎక్స్టర్నల్ ఎవాల్యూయేటర్స్ పరీక్ష తేదీని ఇంటర్నల్ ఎవాల్యుయేటర్ తో కలిపి చెబుతామని మరియు వైవా వాయిస్ ని కూడా ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తామని అన్నారు.

ఇప్పటికే చాలా పాఠశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించ లేదు. మామూలుగా అయితే అవి పాఠశాలలోనే కండక్ట్ చేయాలి కానీ చాలా రాష్ట్రాలు ఢిల్లీ తో సహా పాఠశాలలు మూసివేయడం తో ఈ పరీక్షలు నిర్వహించ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news