GATE Result 2023 : గేట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

-

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌- 2023(GATE) ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ సాయంత్రం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అయితే,  పెద్ద ఎత్తున అభ్యర్థులు ఒక్కసారిగా ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించడంతో సాంకేతిక కారణాలతో సర్వర్‌లో సమస్యలు తలెత్తి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ గత నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గేట్‌ పరీక్షలో సాధించిన  స్కోరుతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలనెలా ఉపకారవేతనం పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది. కొన్ని పబ్లిక్‌, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకూ ఈ స్కోరు ప్రామాణికంగా తీసుకుంటుంటారు. తాజాగా ఫలితాలను ప్రకటించిన అధికారులు.. స్కోర్‌ కార్డులు మాత్రం ఈ నెల 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news