ఇంటర్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్.. ఇలా స్కాలర్ షిప్ ని పొందొచ్చు..!

-

ఇంటర్ పాస్ అయిన విద్యార్ధులకి గుడ్ న్యూస్. జాతీయ స్కాలర్‌షిప్‌ స్కీమ్-202 కోసం కేంద్ర విద్యా శాఖ దరఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ఇంటర్ పాస్ అయినవారు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ స్కాలర్ షిప్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కుటుంబ ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉండి, ప్రతిభ కలిగిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు అర్హులు. దీనికి ఎంపికైతే మొదటి మూడు సంవత్సరాలు ఏడాదికి రూ.10 వేలు చొప్పున వస్తాయి.

అలానే నాలుగు, ఐదు సంవత్సరాలకు ఏడాదికి రూ.20,000 చొప్పున వస్తాయి.అంటే ఈ లెక్కన గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తయ్యే లోపు రూ.70 వేల వరకు వస్తాయి. ఇది ఇలా ఉంటే ప్రతీ ఏడాది దీని ద్వారా 82,000 స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నారు. 41,000 మంది బాలురు, అంతే మొత్తంలో బాలికలకు అందజేస్తున్నారు.

ఈ పథకానికి అర్హత సాధించాలంటే రెగ్యులర్ కోర్సులు మాత్రమే అభ్యసిస్తూ ఉండాలి. అలానే ఇతర స్కాలర్‌షిప్‌ ప్రయోజనాలు పొందకూడదు గమనించండి. అదే విధంగా డిప్లొమా కోర్సులు చదువుతున్న వారు అర్హులు కారు. కరస్పాండెన్స్ లేదా దూర విద్య వాళ్ళు అప్లై చెయ్యకూడదు. ఈ పథకం కింద వర్తించే స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరిస్తారు. గ్రాడ్యుయేట్ నుంచి పీజీ కోర్సు వరకు ఈ పునరుద్ధరణ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: scholarship.gov.in

Read more RELATED
Recommended to you

Latest news