సాధారణంగా పరీక్షలు అంటేనే ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎంత బాగా చదువుకుంటే అంత ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చు. అయితే చాలా మంది పిల్లలు చదివే శక్తి ఉన్న కొన్ని చిన్న పద్ధతుల్లో ఫెయిల్ అవుతుంటారు. అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ పద్ధతులను అనుసరిస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ పద్ధతి గురించి చూస్తే..
ఏ సమస్యలు లేకుండా చదువుకోండి:
మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అవసరం అయిన మెటీరియల్స్ అన్ని తీసి చదవడం ప్రారంభించండి. మీరు చదువుకునే గదిలో సరైన లైట్ ఉండేటట్లు చూసుకోండి. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో కూర్చుని చదువుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. టీవీ రూమ్ లో లేదా హాల్ దగ్గర కూర్చుంటే ఏదో ఒక విధంగా మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని ప్రిఫర్ చేయండి.
ఫ్లో చార్ట్, పిక్చర్స్ ఉపయోగించండి:
గుర్తుపెట్టుకోవడానికి డయాగ్రమ్స్ , చార్ట్స్ బాగా సహాయం చేస్తాయి. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు వీటిని ఉపయోగిస్తే బాగా గుర్తుంటాయి.
పాత క్వశ్చన్ పేపర్స్ ని రిఫర్ చేయడం:
ఒకసారి ప్రీవియస్ పేపర్స్ వంటివి రిఫర్ చేస్తే మీకు ఎటువంటి ప్రశ్నలు వస్తాయి వంటివి తెలుస్తాయి. దీని వల్ల మీరు మరింత బాగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది.
మీరు చదివినది ఎదుటి వారికి చెప్పడం:
ఎప్పుడైనా మీరు నేర్చుకున్నది ఎదుటి వారికి చెప్తే అది మీకు బాగా గుర్తుండి పోతుంది. ఒకవేళ ఎవరూ లేనట్లయితే మీకు మీరే చెప్పుకోవడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. దీనితో మీ మార్కులు కూడా పెరుగుతాయి.
విరామాలు తీసుకోవడం:
మీరు ఒక చాప్టర్ నుండి మరొక చాప్టర్ కి వెళ్లేటప్పుడు చిన్నచిన్న విరామాలు తీసుకోండి. దీని వల్ల మీ మైండ్ రిఫ్రెష్ అయ్యి బాగా చదువుకోవడానికి వీలవుతుంది. కాబట్టి విరామం తీసుకుంటూ ఉండండి.