- జేఈఈ అడ్వాన్స్‌డ్ మే 19
- ఐసీఏఐ సీఏ మే 2019 ఎగ్జామ్స్ మే 3 నుంచి 16 మధ్య (మే 6, 12)
- దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎన్నికలు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. ఏడువిడుతల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా విడుతలకు సంబంధించిన తేదీలను, ప్రాంతాల వివరాలను ప్రకటించింది. అయితే మే 19న దేశవ్యాప్తంగా ఏడురాష్ర్టాలలో 59 నియోజకవర్గాలలో ఎన్నికలు ఉన్నాయి.
అయితే ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ తేదీని నిర్వాహక ఐఐటీ రూర్కీ ఇప్పటికే ప్రకటించింది. మే 19 ఆదివారం అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ నిర్వహిస్తామని. ఆదివారం సీఈసీ ప్రకటించిన ఏడువిడతల్లో చివరి విడత మే 19. కాబట్టి తప్పనిసరిగా అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీని మార్చాల్సిన పరిస్థితి నెలకొంది.
దేశంలో ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, మే 12, మే 19న ఏడువిడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింగ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగునున్నాయి.
ఎన్నికల షెడ్యూల్‌లో ప్రకటించిన తేదీలలో జరిగే పరీక్షల్లో ప్రధానమైనవి జేఈఈ అడ్వాన్స్‌డ్ మే 19, ఐసీఏఐ సీఏ మే 2019 ఎగ్జామ్స్ మే 3 నుంచి 16 మధ్య (మే 6, 12).
ఈ పరీక్ష తేదీల మార్పులకు సంబంధించి వివరాలను ఐఐటీ రూర్కీ, ఐసీఏఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. త్వరలో వీటికి సంబంధించి వివరాలు ఆయా సంస్థల వెబ్‌సైట్‌లలో, పత్రికా పక్రటనల్లో విడుదల చేయవచ్చు.
– కేశవ