IRCTC : ఇంట్లో ఉండే రూ.80,000 వరకు ఇలా సంపాదించచ్చు..!

-

మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ పొందాలని భావిస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఈ విధంగా మీరు వర్క్ చేస్తే.. 80 వేల రూపాయలు వరకు సంపాదించవచ్చు. IRCTC బుకింగ్ ఏజెంట్ కింద పని చేయడం వల్ల ఇలా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ పొందచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ కేటరింగ్ సర్వీసులు చేస్తుంది. డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 55 శాతం టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడం జరుగుతుంది.

ఐఆర్సీటీసీ ఏజెంట్స్ ఎలా పని చేస్తారు అనేది చూస్తే.. నాన్ ఏసీ టికెట్స్ కి అయితే 20 రూపాయలు ఒక పిఎన్ఆర్ కి.. ఏసీ క్లాస్ టికెట్లు అయితే 40 రూపాయల వరకు పొందొచ్చు. రెండు వేల రూపాయలు దాటిన ట్రాన్సాక్షన్స్ కి అయితే ఒక శాతం. 2000 రూపాయల కంటే తక్కువ ఛార్జీలుకైతే 0.75 శాతం డబ్బులు పొందొచ్చు.

నెలలో ఎన్ని టికెట్లు అయినా బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా ప్రతి బుకింగ్ మరియు ట్రాన్సాక్షన్ పైన కమిషన్ వస్తుంది. ఇలా ఏజెంట్ లాగ పని చేసి మీరు 80 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.

ఐఆర్సీటీసీ ఏజెంట్ కి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి..?

ఎన్ని టికెట్లు అయినా బుక్ చేసుకోవచ్చు.
ఏ రకం టికెట్లు అయినా సరే బుక్ చేసుకోవచ్చు.
జనరల్ పబ్లిక్ బుకింగ్ ఓపెన్ అయినా 15 నిమిషాలకి తత్కాల్ బుక్ చేసుకోవచ్చు.
అలానే ఈజీగా క్యాన్సల్ చేసుకోవచ్చు.
రైల్వే సర్వీస్, బస్సు, హోటల్, హాలిడేస్, రీఛార్జ్ ఎటువంటివైనా సరే బుక్ చేసుకోవచ్చు.

ఒక సంవత్సరం ఏజెన్సీకి అయితే 3,999 రూపాయలు చార్జ్ చేస్తారు. రెండు సంవత్సరాల ఏజెన్సీకి అయితే ఏజెన్సీకి 6999 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది.

ఒకవేళ కనుక వంద టిక్కెట్లు బుక్ చేస్తే అప్పుడు పది రూపాయలు టికెట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదే 101 నుండి 300 టిక్కెట్లుకైతే ఎనిమిది రూపాయలు ఛార్జ్ చేస్తారు. 300 టికెట్లు కంటే ఎక్కువైతే ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది.

ఐఆర్సీటీసీ ఏజెంట్ ఎలా అవ్వచ్చు..?

ముందుగా రిజిస్ట్రేషన్ ఫార్మ్ ని ఆన్ లైన్ లో నింపండి.
డాక్యుమెంట్లు మరియు సంతకం చేసిన అప్లికేషన్, డిక్లరేషన్ ఫామ్ ని పంపించాలి.
ఒకసారి డాక్యుమెంట్లు వెరిఫై అయిపోతే రూపాయలు 1180 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఓటిపి తర్వాత డిజిటల్ సర్టిఫికెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అలానే వీడియో వెరిఫికేషన్ ఉంటుంది.
డిజిటల్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఐఆర్సీటీసీ ఫీజు చెల్లించాలి.
ఫీజు చెల్లించిన తర్వాత మెయిల్ వస్తుంది.
ఇలా మీరు టికెట్లు బుక్ చేయవచ్చు.
పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, వాలిడ్ ఇమెయిల్ ఐడి, ఫోటో, ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్, డిక్లరేషన్ ఫామ్ మరియు రిజిస్ట్రేషన్ ఫామ్ అవసరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news