ఏప్రిల్, మే నెలలో దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో లోక్‌సభ ఎన్నికలను సీఈసీ ప్రకటించింది. దీంతో అనేక పరీక్షల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఎగ్జామ్ జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో కూడా స్వల్ప మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-జేఈఈ విభాగం ప్రకటించింది.
లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో జరుగనున్నాయి.
దీంతో జేఈఈ మెయిన్ ఏప్రిల్ 2019ను మొదట ప్రకటించినట్లు ఏప్రిల్ 6-20 మధ్య కాకుండా 7-20 తేదీల మధ్య నిర్వహించనున్నారు.
పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్) కోసం నిర్వహించే తేదీలను ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించనున్నారు.
పేపర్-1 (బీఈ/బీటెక్) కోసం నిర్వహించే పరీక్షను 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహించనున్నారు.
పూర్తి సమాచారం కోసం https://jeemain.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
నోట్- తెలంగాణ, ఏపీలలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్నాయి.
– కేశవ