ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీ ..పూర్తి వివరాలు ఇలా..!

-

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉన్న 482 అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్స్‌లో ఈ పోస్టులున్నాయి. మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాలు ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

 

దీనికి సంబందించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొదలయింది.. ఈనెల నవంబర్ 22 దరఖాస్తుకు ఆఖరి తేదీ. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS వెబ్సైటు https://portal.mhrdnats.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెబ్సైటులో https://apprenticeshipindia.org లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో మొత్తం ఖాళీలు 482.

వీటికి సంబందించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు అయ్యింది. దరఖాస్తుకు ఆఖరి తేదీ నవంబర్ 22, 2020. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 30 నాటికి 18 నుంచి 24 మధ్యలో ఉండాలి. ఈ పోస్టులకు రాతపరీక్ష 6 డిసెంబర్ 2020 న జరుగుతుంది. ,మరి ఇన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌: https://iocl.com లో చూసి తెలుసుకోవచ్చు.

పోస్టులను బట్టి వివిధ రకాల విద్యార్హతలున్నాయి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు.. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణులు అవ్వాలి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు ఆయా సంబంధిత సబ్జెక్ట్స్‌లో డిగ్రీ ఉతీర్ణత పొంది ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు అయితే ఇంటర్ పూర్తి చేస్తే చాలు. మరిన్ని వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news