తెలంగాణా ఎన్నికల కమిషన్ కి ఇక్కడి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంచాలని ఈసీకి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ గతంలో ఫామ్ 18, అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా అప్లికేషన్ చేసుకునేలా చేస్తామని వివరించింది.
అలానే గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని హైకోర్టుకు తెలిపిన ఈసీ అవసరమైన వారు డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని కోర్టుకు తెలిపింది. ఇక ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఇక ఈసీ వివరణ నమోదు చేసి పిటిషన్ పై విచారణని హైకోర్టు ముగించేసింది. పట్ట భద్రుల ఓటు నమోదు గడువు పెంచాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఈసీ పేర్కొంది.