సీ-డాక్‌ ముంబై జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. వివరాలు ఇవే..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముంబై లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC) 51 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల కోసం భర్తీ చేస్తోంది. కనుక ఈ పోస్టులకి అర్హత, ఆసక్తి వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

దీనిలో మొత్తం 51 పోస్టులు వున్నాయి. బీఈ, బీటెక్‌, ఎంసీఏ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణ సాధించాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు జులై 3 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలకు https://cdac.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు. దీని కోసం మీరు కనుక అప్లై చెయ్యాలని అనుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ జూలై 3, 2021. అప్లికేషన్‌ ఫీజు వచ్చేసి రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు గమనించండి.

వెబ్‌సైట్‌: https://cdac.in/

Read more RELATED
Recommended to you

Latest news