ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తో పాటుగా మంచి వ్యాయామం చేయాలి. సరిగ్గా వేళకి తినడం నిద్రపోవడం కూడా చాలా అవసరం. అయితే మంచిగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే పుష్ అప్స్ బాగా సహాయపడతాయి.
పుష్ అప్స్ చేయడం వల్ల మీరు ఫిట్ గా ఉండొచ్చు. ఇంట్లో కూడా మీరు రెగ్యులర్ గా చెయ్యచ్చు. పుష్ అప్స్ చేయడం వల్ల మీరు ఫిట్ గా ఉండొచ్చు. ఇంట్లో కూడా మీరు రెగ్యులర్ గా చెయ్యచ్చు. ప్రతి రోజు పుష్ అప్స్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం..!
రోజుకి ఎన్ని పుష్ అప్స్ చెయ్యచ్చు..?
అయితే రోజుకు ఎన్ని పుష్ అప్స్ చేయవచ్చు అనే విషయం లోకి వస్తే.. ఆరోగ్యకరమైన వ్యక్తి ఒకసారి 20 నుండి 25 పుషప్స్ చేయవచ్చు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్లు 40 నుండి 50 పుష్ అప్స్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల కలిగే బెనిఫిట్స్:
పుష్ అప్స్ చేయడం వల్ల పై శరీర భాగాలకి సామర్ధ్యం అందుతుంది. చాతి, భుజాలు, చేతులు స్ట్రాంగ్ గా ఉంటాయి. బాడీ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. కార్డియో వర్కౌట్ తో పాటు పుష్ అప్స్ కూడా చేయొచ్చు.
ఇలా చేయడం వల్ల మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో బ్లడ్ పంప్ సామర్ధ్యం కూడా పెరుగుతుంది. రెగ్యులర్గా పుష్ అప్స్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. పోస్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా రెగ్యులర్ గా పుష్ అప్స్ చేసి ఈ బెనిఫిట్స్ ని మీరు పొందొచ్చు.