కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. టెన్త్ ప్యాస్ అయితే చాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ లో పలు ఖాళీలు వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ లో మొత్తం 256 ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, ఎంబీబీఎస్‌ ఇలా వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి. అలానే ఈ పోస్టుకి అప్లై చేసుకునే వారు స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి. శాలరీ రూ.19,900ల నుంచి రూ.1,77,500ల వరకు ఉండనుంది. నవంబర్‌ 28, 2022వ తేదీ లోగా అప్లై చేసుకోవాల్సి వుంది.

ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.500లు చెల్లించాల్సి వుంది. పోస్టుల వివరాలను చూస్తే.. మెడికల్ ఆఫీసర్ పోస్టులు 1
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు 1, నర్సింగ్ ఆఫీసర్ పోస్టు 195, స్టోర్ కీపర్ పోస్టు 1, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఎల్‌డీసీ) పోస్టులు 37 వున్నాయి.

అలానే జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 10, జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్-రే) పోస్టులు 2, జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 1, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు 2, సీఎస్‌ఆర్‌ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులు 2, ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రేడ్-2 పోస్టులు 2, మానిఫోల్డ్ టెక్నీషియన్ గ్రేడ్-4 పోస్టులు 2 వున్నాయి.

పూర్తి వివరాలను https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/home.jsp లో చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news