మచిలీపట్నం BELలో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. దీనిలో మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

jobs
jobs

ఎంపికైతే రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చెయ్యాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఆఫ్ లైన్ విధానం లో అప్లై చెయ్యాల్సి ఉంటుంది. అప్లై చెయ్యడానికి డిసెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్), ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్), ప్రాజెక్ట్ ఇంజనీర్(Computer Science) ఖాళీలు వున్నాయి. ఇక అర్హతల విషయంలోకి వస్తే… ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ విభాగం గురించి చూస్తే… ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ లేదా టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్/ఎంటెక్ చేసిన అభ్యర్థులు ఈ విభాగం లోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

మెకానికల్ విభాగంలో అయితే బీటెక్/ఎంటెక్ చేసుండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీటెక్/ఎంటెక్ చేసిన వారు ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ను Manager (HR) ,Bharat Electronics Limited, Ravindranath Tagore Road, Machilipatnam – 521001, Andhra Pradesh చిరునామాకు ఈ నెల 24లోగా పంపించాల్సి ఉంటుంది.