నేషనల్ ఎడ్యుకేషన్ అలయెన్స్ ఫర్ టెక్నాలజీ (నీట్) ఆన్లైన్లో ఉచితంగా స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును అందిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఇండ్లలోనే ఉంటున్న విద్యార్థులకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని నీట్ తెలిపింది. అందుకుగాను స్కూల్‌నెట్ ఇండియా లిమిటెడ్, ఇంగ్లిష్ హెల్పర్ అనే సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఇంగ్లిష్ బోలో అనే కార్యక్రమ నిర్వాహకులతో నీట్ భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో విద్యార్థులు ఉచితంగా ఆన్లైన్లో ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.
ఇందులో భాగంగా విద్యార్థులు ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్, ప్రనౌన్సియేషన్ తెలుసుకోవచ్చు. అలాగే పదాలకు అర్థాలు నేర్చుకోవచ్చు. పిక్చర్ డిక్షనరీతో ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. దీంతో వారు తమ ఇంగ్లిష్‌కు మరింత పదును పెట్టుకోవచ్చు. అలాగే ఆ భాషలో మరింత ప్రావీణ్యత సంపాదించవచ్చు. అయితే మొదటి 25 రోజులకు మాత్రమే ఈ కోర్సు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత కొద్దిపాటి రుసుము చెల్లించి మిగిలిన పాఠాలను నేర్చుకోవచ్చు.
ఇక ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే వారు https://neat.aicte-india.org/course అనే వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తరువాతే అదే సైట్‌ను ఓపెన్ చేసి.. అందులో ఇంగ్లిష్ బోలో అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. దాంట్లో బై నౌ అనే ఆప్షన్‌ను కనిపిస్తుంది. దాన్ని ఎంచుకున్నాక ఒక కూపన్ జనరేట్ అవుతుంది. అది యూజర్ మెయిల్ లేదా ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. దాంతో ఆ కూపన్‌ను రిడీమ్ చేసుకుని మొదటి 25 రోజుల పాటు https://www.englishbolo.com/ వెబ్సైట్లో ఉచితంగా ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. ఇక ఆ పాఠాలన్నీ సొంతంగా నేర్చుకునే రీతిలో ఉంటాయి కనుక.. ఎవరైనా సులభంగా ఇంగ్లిష్‌ను నేర్చుకోవచ్చు..!