ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? మీరు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారా? అయితే, మీకో శుభవార్త..! తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఓ నోటిఫికేషన్ విడుదల అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6,506 కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టుల భర్తీ కోసం సీజీఎల్ (కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్ ఎగ్జామినేషన్) నోటీఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా కేంద్రంలోని పలు విభాగాలకు చెందిన 6,506 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి కనీస ఆర్హత ఎదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక దరఖాస్తు చేసుకోడానికి చివరి తేది ఈ నెల 31 (జనవరి). రిజిస్టర్ చేసుకున్న వారు వచ్చే నెల 2వ తేది లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజును చెల్లించాలి. ఆలస్య రూసుముతో ఫిబ్రవరి 6వ తేది లోపు చెల్లించవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారితో పాటు మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపును ఇచ్చారు. ఇక ఇతర వర్గాలు (ఓసీలు), పురుషులకు దరఖాస్తు ఫీజు రూ.100 గా ఉంది. మరిన్ని వివరాలకు https://ssc.nic.in సైట్‌ను లాగిన్ అవ్వండి.