జీఆర్ఎస్ఈలో 256 అప్రెంటీస్‌ ఖాళీలు… ఇలా అప్లై చేసుకోండి..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ లో పలు పోస్టులు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. జీఆర్ఎస్ఈ నోటిఫికేష‌న్ ద్వారా 256 అప్రెంటీస్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ మరియు టెక్నీషియన్ అప్రెంటీస్ విభాగాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అక్టోబ‌ర్ 1, 2021 లోగ అప్లై చేసుకోవాలి.

 

 

jobs
jobs

ఎంపికైన వారికి నోటిఫికేష‌న్‌లో తెలిపిన విధంగా ఒప్పందం ప్ర‌కారం కాల‌ప‌రిమితి ఉంటుంది. జీతం కూడా కాంట్రాక్టు స‌మ‌యంలో పేర్కొన్న విధంగా ఉంటుంది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ట్రేడ్ అప్రెంటీస్ 170 ఖాళీలు వున్నాయి. ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) లో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 14-25 ఏళ్లు ఉండాలి. ట్రేడ్ అప్రెంటీస్ (ఫ్రెషర్) 40 ఖాళీలు వున్నాయి. పదో తరగతి పాసై ఉండాలి.

వయస్సు 14-20 ఏళ్లు ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రంటీస్ 16 పోస్టులు వున్నాయి. గ్రాడ్యుయేట్ అప్రంటీస్ 14-26 ఏళ్లు ఉండాలి. ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ అప్రెంటీస్ పోస్టులు 30 వున్నాయి. ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 14-26 ఏళ్లు ఉండాలి. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అక‌డామిక్‌, అనుభ‌వం ఆధారంగా మాత్ర‌మే ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ కోసం http://www.grse.in/images/pdf/Apprentices-Advt.-Detail-01.09.21.pdf లో పూర్తి వివరాలని చూడచ్చు.