ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ లో జాబ్స్.. వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

వెస్టర్న్ రీజియన్‌ లోని రీజనల్ హెడ్‌క్వార్టర్స్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, వంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చెయ్యడానికి 2021 నవంబర్ 30 చివరి తేదీ. మొత్తం తొంబై ఖాళీలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా లాంటి ప్రాంతాల్లో ఈ ఖాళీలు వున్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ ట్రేడ్ పాస్ కావాలి.

రెండు వేరు వేరు నోటిఫికేషన్స్ ద్వారా వీటిని భర్తీ చేస్తున్నారు. ఏడాది పాటు పనినిచ్చే పోస్తులివి. స్టైపెండ్ రూ.9,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు https://www.apprenticeshipindia.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంది. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్ https://portal.mhrdnats.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు వంటివి నోటిఫికేషన్ లో చూడచ్చు.

టెక్నీషియన్ అప్రెంటీస్ నోటిఫికేషన్: https://www.aai.aero/sites/default/files/examdashboard_advertisement/AAI%20RHQ%20WR%20ADVERTISEMENT%20FOR%20ITI%20%20APPRENTICES%20FY%202021%2022.pdf

డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ నోటిఫికేషన్:
https://www.aai.aero/sites/default/files/examdashboard_advertisement/AAI%20RHQ%20WR%20ADVERTISEMENT%20FOR%20GRADUATE%20AND%20DIPLOMA%20APPRENTICES%20FY%202021%2022.pdf

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news