నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాలు Anganwadi jobs భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. దీనితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోస్టులని భర్తీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency
ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. అశ్వరాపుపేట, దమ్మపేట మండలాల్లోని అంగన్వాడీ ఖాళీల భర్తీకి ఈ నియమకాలు చేపట్టారు. ఇందులో అశ్వారావుపేట ప్రాజెక్ట్‌ పరిధిలో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 01, ఆయా పోస్టులు 03, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02, దమ్మపేట ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 03, ఆయా పోస్టులు 13, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02 ఉన్నాయి.

ఇలా ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జులై 31 దరఖాస్తులకు చివరితేది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పాసై.. వివాహమైన మహిళా అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అలానే స్థానికంగా నివాసం ఉండాలి. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. పూర్తి వివరాలను https://mis.tgwdcw.in/ వెబ్ సైట్‌లో చూసి అప్లై చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news