టీఆర్‌ఎస్‌ ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవితకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఎంపీ మాలోత్‌ కవితకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. మాలోత్‌ కవితకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది ప్రజా ప్రతినిధులు న్యాయ స్థానం. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో డబ్బులు చేశారన్న కేసులో ప్రజా ప్రతినిధులు కోర్టు తీర్పు ను వెల్లడించింది.

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవితపై గతంలో అంటే… 2019 సంవత్సరం లో బూర్గం పహాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది. అయితే… ఈ కేసును ఇవాళ విచారించింది ప్రజా ప్రతినిధులు న్యాయ స్థానం. ఈ నేపథ్యంలోనే ఎంపీ మాలోత్‌ కవితకు రూ. 10 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించింది ప్రజా ప్రతినిధులు న్యాయ స్థానం. అయితే… దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.