బీడీఎల్ విశాఖపట్నంలో 13 అప్రెంటీస్ పోస్టులు..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీడీఎల్ విశాఖపట్నంలో 13 అప్రెంటీస్ పోస్టులు వున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పదమూడు పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్‌-07, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌-04, ఎలక్ట్రీషియన్‌-02.

ఇక అర్హత వివరాల లోకి వెళితే… పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడుల లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి గమనించండి. ఇక వయసు విషయానికి వస్తే… 05.03.2021 నాటికి 14 ఏళ్లకు తగ్గకుండా 30ఏళ్లకు మించకుండా ఉండాలి. అదే ఎస్సీ/ఎస్టీలకు అయితే ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ మెరిట్‌ (పదో తరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది గమనించండి. ఎంపికైన వాళ్ళకి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఎంపికైతే నెలకు రూ.8050 స్టయిపెండ్‌ చెల్లిస్తారు. మార్చి 5, 2021 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది. మరిన్ని వివరాలని కనుక మీరు తెలుసుకోవాలి అంటే http://bdl-india.in లో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news