బీఈఎల్ లో ఖాళీలు… నేడే అప్లై చెయ్యండి..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..! BHEL సంస్థకు సంస్థకు చెందిన పూణే లోని బ్యాటరీ మానుఫాక్చరింగ్ ప్రాజెక్టు లో ఖాళీల భర్తీకి నియామకాలను చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… సీనియర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు.

దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగం, అర్హత ఆధారంగా నెలకు రూ. 50 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. మొత్తం దీనిలో తొమ్మిది కాళీలు వున్నాయి. ఇందులో మూడు సీనియర్ ఇంజనీర్, నాలుగు ప్రాజెక్ట్ ఇంజనీర్, మరో రెండు ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాలు. కెమికల్ అండ్ ఎలక్ట్రో కెమికల్ ఇంజనీరింగ్ లో BE, BTech, AMIE/GIETE చేసి ఉంటే సీనియర్ ఇంజినీరింగ్ పోస్టుకి అర్హులు.

అలానే ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో ఏఐసీటీఈ అప్రూవుడ్ సంస్థ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ చేసిన వారు ప్రాజెక్ట్ మ్యానేజర్ పోస్టుకి అర్హులు. లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి రెండేళ్ల అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ చేసిన వారు ట్రైనీ ఆఫీసర్ పోస్టుకి అర్హులు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

“Bharat Electronics Limited” పేరుతో డీడీ తీసి అప్లికేషన్ ఫామ్ తో కలిపి పంపించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ స్కాన్ కాపీ, పర్సనల్ డేటా తో కూడిన ఎక్సెల్ షీట్ ను [email protected] ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది. మిగిన సమాచారం కోసం మీరు https://www.bel-india.in/Documentviews.aspx?fileName=English-Pune-Web-Advt-PE-TO-MBA-Finance-16-03-2021.pdf, https://www.bel-india.in/Documentviews.aspx?fileName=English-Pune-Advt-FTE-E-III-Sr-16-03-2021.pdf వీటిలో చూడచ్చు.