గుడ్ న్యూస్: (BSF) బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

BSF /బీఎస్ఎఫ్‌

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 170 ఖాళీలను ప్రకటించింది. ఎయిర్ వింగ్, పారామెడికల్, వెటర్నరీ పోస్టులున్నాయి.

ఈ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ https://bsf.gov.in లేదా రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ లో తెలుసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చెయ్యాల్సి వుంది.

ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. మొత్తం ఖాళీలు- 170 ఉండగా.. పారామెడికల్ సిబ్బంది- 75,
ఎస్సై (స్టాఫ్ నర్స్) నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్ట్- 37, ఏఎస్సై (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్ట్- 1, ఏఎస్సై (ల్యాబరేటరీ టెక్నీషియన్) గ్రూప్ సీ పోస్ట్- 28, సీటీ (వార్డ్ బాయ్, వార్డ్ గాళ్, ఆయా) గ్రూప్ సీ పోస్ట్- 9.

వెటర్నరీ సిబ్బంది- 35 ఉండగా హెచ్‌సీ (వెటర్నరీ) గ్రూప్ సీ పోస్ట్- 20, కానిస్టేబుల్ (కెన్నెల్‌మ్యాన్) గ్రూప్ సీ పోస్ట్- 15 వున్నాయి. ఎయిర్ వింగ్- 65 ఉండగా అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్)- 49, అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్)- 8, కానిస్టేబుల్ (స్టోర్‌మ్యాన్)-8.

దరఖాస్తుకు చివరి తేదీ 2021 జూలై 26. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.