తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(SVVU) లో ఖాళీలు వున్నాయి. అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చెయ్యొచ్చు. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ల్యాబరేటరీల్లోని ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… పదో తరగతి పాసైన వారి తో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు లో రెండేళ్ల డిప్లొమో కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థులు సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చెయ్యాలి. నెలకి రూ.17,500 వేతనం వస్తుంది. ఇక వయస్సు అయితే 2020 జూలై 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల వయస్సు ఉండాలి. అయితే దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు వుంది.
పోస్టుల ఖాళీలు చూస్తే…. విజయనరంలో 8, శ్రీకాకుళంలో 9, విశాఖప్నంలో 9, ఈస్ట్ గోదావరిలో 16, వెస్ట్ గోదావరి లో 14, గుంటూరు లో 15, కృష్ణా జిల్లా లో 12, ప్రకాశంలో 11, నెల్లూరు లో 8, చిత్తూరులో 12, కడప లో 9, కర్నూలులో 12, అనంతపురంలో 12 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులను మార్చి 20వ తేదీ వరకు పంపించాల్సి ఉంటుంది.
మార్చి 29న మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తుతో పాటు విద్యార్హతల సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, మెమోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా దరఖాస్తులను పరిశీలించిన తరువాత డీఎంఎల్టీ కోర్సులో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. దరఖాస్తు ఫీజును రూ.200.