డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల!

ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీఓ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ సందర్భంగా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఢిల్లీలోని తిమర్పూర్‌ సంస్థ ప్రాంగణంలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. ఐటీఐ అప్రెంటీషిప్‌ విభాగంలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సీఓపీ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 7 వేలు, ఇతర ట్రేడ్‌ లలో ఎంపికైన వారికి నెలకు రూ.8,050 చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.

ఖాళీల వివరాలు..

  • ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో మెషీన్‌ మోటార్‌ వెహికిల్‌ విభాగంలో 3, డ్రాట్‌మెన్‌ 4, ఎలక్ట్రానిక్‌ మెషీన్‌ 5, ఇన్సుస్ట్రుమెంట్‌ మెషీన్‌ మెకానిక్‌ 6, లాబరేటరీ అసిస్టెంట్‌(కెమికల్‌ ప్లాంట్‌) విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి.
  • 5/ 10 కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో 14 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 18 –27 ఏళ్లు ఉండాలి.
  • యూఆర్‌ అభ్యర్థులకు 27, ఓబీసీ 30 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 32 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. సంబంధిత విభాగంలో ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేయొచ్చు.
  • అభ్యర్థులు డీఆర్డీఓ నియామకాలకు సంబంధించిన అధికారిక వెబ్‌ సైట్‌ www. rac.gov.in ను ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలి.