ఇప్పుడు దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనీసం ఉపాధి లేకుండా చాలామంది నిరుద్యోగులుగా బ్రతుకుతున్నారు. ఇక ఇలాంటి వారందరి కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంచి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా నోటిఫికేషన్ ను ఈ మేరకు యూపీఎస్సీ జారీ చేసింది. ఇందులో భాగంగా 151 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ సిద్ధమైంది. కాగా ESIC అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయిమెంట్ లో భాగంగా ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
అయితే ఈ151 ఉద్యోగాల్లో 66 జాబులను అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచిన అధికారులు మిగతా వాటికి మాత్రం ఎస్సీలకు 23శాతం, అలాగే ఎస్టీలకు 09 శాతం EWS కేటగిరీలో 15శాతం అలాగే ఓబీసీలకు కూడా 38 శాతం వరకు కేటాయించారు యూపీఎస్సీ ఉన్నతాధికారులు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియను కూడా స్టార్ట్ చేశారు అధికారు.
ఇంట్రెస్ట్ ఉన్న వారు http://www.upsconline.nic.in లింక్ ద్వారా సెప్టెంబర్ 2 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని, అయితే ఈ నోటిఫికేషన్ ను డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల కోసం వేసినట్టు సమాచారం. వీటికి ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు. అలాగే క్యాండిడేట్లకు మూడేళ్ల అనుభవం కచ్చితంగా ఉండాలని యూపీఎస్సీ తెలుపుతోంది. ఇక క్యాండిడేట్లు రూ. 25ను ఫీజుగా అప్లికేషన్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఫీజీ నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, అలాగే PwBD క్యాండిడేట్లకు మినహాయింపు ఇచ్చారని తెలుస్తోంది.