ఇండియన్ ఆయిల్ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. సదరన్ రీజియన్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. దీనిలో మొత్తం 480 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ లాంటి పోస్టులు ఉన్నాయి.

 

ఇక పోస్టుల వివరాలలోకి వెలితే… మొత్తం ఖాళీలు 480, తెలంగాణ 60, ఆంధ్రప్రదేశ్ 65,
తమిళనాడు, పుదుచ్చెరి 194, కర్నాటక 96, కేరళ 65. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 28 చివరి తేదీ. ఇక విద్యార్హతలని చూస్తే… అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా డిప్లొమా పాస్ కావాలి.

వయస్సు జూన్ 30 నాటికి 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఆగస్ట్ 28 సాయంత్రం 5 గంటలు. రాతపరీక్ష తేదీ 2021 సెప్టెంబర్ 19 . డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2021 సెప్టెంబర్ 27. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.