ఏపీలో జాబ్ మేళా.. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినవారికి అవకాశం!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ వరుసగా జాబ్ మేళాలని నిర్వహిస్తోంది. ఈ నెల 6న కడప లో ఈ జాబ్ మేళాని నిర్వహిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ జాబ్ మేళాలో హెటిరో డ్రగ్స్ 150 ఖాళీలను భర్తీ చేయనుంది. మూడు విభాగాల్లో ఖాళీలను భర్తీలను చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

jobs
jobs

జూనియర్ కెమిస్ట్రీ లేదా జూనియర్ ఆఫీసర్ విభాగంలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ & ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలైటికల్ కెమిస్ట్రీ) విద్యార్హత కలిగిన వాళ్ళు అప్లై చెయ్యచ్చు. 2018-2021 మధ్య పాసైన వారే అర్హులు. వయస్సు వచ్చేసి 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైతే హైదరాబాద్ లేదా వైజాగ్ లో పని చెయ్యాల్సి ఉంటుంది. 13 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం ఇస్తారు.

ఇక టెక్నీషియన్ పోస్టుల గురించి చూస్తే.. దీనిలో 50 ఖాళీలు ఉన్నాయి.ITI (ఫిట్టర్) & డిప్లొమా (మెకానికల్) వారు అర్హులు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల వేతనం ఇస్తారు. అలానే జూనియర్ ఇంజినీరింగ్ పోస్టులు గురించి చూస్తే.. దీనిలో 30 ఖాళీలు ఉన్నాయి. బీటెక్(కెమికల్ ఇంజనీరింగ్) పూర్తి చేసినవారు అప్లై చెయ్యచ్చు.

ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వేతనంతో పాటు అలవెన్స్ ఉంటుంది. www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 6300125455 నంబర్ ను సంప్రదించవచ్చు. 06-11-2021, 10:00 AM నుండి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అడ్రస్: యోగి వేమన యూనివర్సిటీ క్యాంపస్, పులివెందుల రోడ్, వేమనాపురం, గంగనాపల్లే, కడప.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news