ఇస్రో లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో (ISRO) ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి భర్తీ చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తోంది. జూనియర్ ట్రాన్స్ లేషన్ విభాగం లో ఈ ఖాలీలు వున్నాయి. దీనిలో కనుక సెలెక్ట్ అయితే ఇస్రో కి చెందిన హ్యూమన్ స్పేస్ ఫైట్ సెంటర్ లో వర్క్ చెయ్యాలి. ఇది ఇలా ఉంటే ఎంపికైన వారికి నెలకు రూ.1,12,400 వేతనం ఇస్తారు.

ఇక అర్హత విషయంలోకి వస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థుల డిగ్రీ లెవల్ లో ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయ్యుండాలి. అదే విధంగా ఇంగ్లిష్, హిందీ కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోడానికి అర్హులే.

డిగ్రీలో హిందీ మీడియం ఉండి ఇంగ్లిష్ కంపల్సరీ లేదా ఎలక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలి. హిందీ లేదా ఇంగ్లిష్ లో కాకుండా ఇతర సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వారూ అర్హులే. డిగ్రీ స్థాయిలో హందీ మీడియంలో చదివి ఉండాలి. లేదా హిందీ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అవ్వాలి. అలానే హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి హిందీ భాషకు ట్రాన్స్ లేషన్ సర్టిఫికేట్ వుంది తీరాలి లేదు అంటే రెండేళ్లు అనుభవం వున్నా పరవాలేదు.

దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు పంపడానికి నవంబర్ 20 ఆఖరి తేదీ. ఇస్రో అధికారిక వెబ్ సైట్లో https://www.isro.gov.in/ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news