నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NITలో నాన్ టీచింగ్ పోస్టులు..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా ఎన్ఐటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్ఐటీ సిల్చార్ (NIT – Silchar) లో నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి జూలై 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ ఫామ్ స్కానింగ్ కాపీని [email protected]కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.

దీనిలో మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ విభాగం లో ఒక్కో పోస్ట్ వుంది. అదే విధంగా సూపరింటెండెంట్ విభాగం లో 7 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Technical Assistant / SAS Assistant / Junior Engineer విభాగాల్లో 37 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 4 ఖాళీలు ఉన్నాయి. వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హత వుంది గమనించండి.

Read more RELATED
Recommended to you

Latest news