మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతి రాజు

అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతి రాజు కొనసాగన్నారు. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతి హైకోర్టును ఆశ్రయించారు.

సోమవారం విచారణ చేపట్టిన కోర్టు మాన్సాస్ ఛైర్ పర్సన్‌గా సంచయిత నియామక జీవోను కొట్టివేసింది. సంచయిత దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చింది. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా కొనసాగించాలని ఆదేశించింది. 72 జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అశోక్ గజపతి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. సింహాచలం ట్రస్ట్‌కు కూడా అశోక్ గజపతి రాజు ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. గత మార్చిలో సంచయిత మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా సంచయిత కొనసాగుతున్నారు. అప్పట్లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది.