ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈటల టిఆర్ఎస్ లోనే ఉన్నా బాగుండేదని.. పోయి.. పోయి బిజేపిలో చేరాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోసం ఈటలకు ఎందుకు ఇంత తాపాత్రేయమని.. కేసీఆర్ తో అడ్జేస్ట్ అయి ఉంటే ఎమ్మెల్యే, మంత్రి పదవులు అయినా ఉండేవి కదా అని ఈటలకు చురకలు అంటించారు. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కోసం ట్రై చేస్తుండు అని కేసీఆర్ ఆయనపై చేసిన పనిని కాంగ్రెస్ పార్టీ విమర్శించిందని.. మంత్రి మల్లరెడ్డి కాలేజ్, పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజ్, కేటీఆర్ విలాసవంత ఫామ్ హౌస్ కూడా అక్రమణల మీదే కట్టారు
వాటిపై ఎందుకు ఎంక్వైయిరి చేయట్లేదని నిలదీశారు.
కేసీఆర్ కుటుంబ ఆస్తులు అప్పుడు ఎంత ఉన్నాయి.. ఇప్పుడు ఎంత ఉన్నాయని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో మధ్యంతర పిఆర్సీ ఇస్తున్నారు..కానీ మన తెలంగాణ లో మూడు పండగలు గడిచినా ఇంకా కొత్త పీఆర్సీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో మధ్యంతర భృతి కల్పించకపోవడంతో చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని.. పీఆర్సీ పదవి విరమణ సమయంలో ఇస్త అనడం కేసీఆర్ కే చెల్లిందన్నారు. ఈరోజు ఇవ్వాల్సిన పీఆర్సీ ఇరవై సంవత్సరాలు తర్వాత ఎంత అవుతుందో అందరికి తెలిసిందేనని పేర్కొన్నారు.