యూసీఐఎల్‌లో ఉద్యోగాలు… వివరాలివే..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూరేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

jobs
jobs

ఈ నోటిఫికేష‌న్ ద్వారా అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు అక్టోబ‌ర్ 25, 2021 చివరి తేదీ. నోటిఫికేష‌న్ సంబంధిత వివ‌రాలు తెలుసుకోవ‌డానికి http://uraniumcorp.in/job.html వెబ్‌సైట్‌ను చూసి తెలుసుకోచ్చు.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ (సివిల్) పోస్టుకి అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సివిల్ రంగంలో ఇంజనీరింగ్ చేయాలి. భవన నిర్మాణ రంగంలో, రోడ్డు కన్ స్ట్రక్షన్లో అనుభవం ఉండాలి. పోస్టు పని అర్హత రెండేళ్లు ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఇక సూప‌ర్‌వైజ‌ర్ (సివిల్) అయితే సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసి ఉండాలి. పోస్టు అనుభవం ఐదు ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. అభ్య‌ర్థి విద్యార్హ‌త‌, ప‌ని అనుభ‌వానికి ఇలా ప్ర‌తీ దానికి ప్ర‌త్యేక వెయిటేజీ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ కి పిలుస్తారు. పూర్తి వివరాలని http://uraniumcorp.in/job.html లో చూసి అప్లై చేసుకోండి.