రోజుకు 200 ఆదా చేసి రూ.14 లక్షలు పొందండిలా..!

-

మీరు మీ డబ్బులని పెట్టి మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా..? చిన్న మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా మీరు పెద్ద ఫండ్ జమ చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సులభంగా మంచి ఫండ్ తీసుకొచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

money
money

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (పిపిఎఫ్) లో డబ్బులు పెట్టి మంచిగా రాబడి పొందొచ్చు. అయితే దీని కోసం ఎక్కువగా డబ్బు ఆదా చెయ్యక్కర్లేదు. రోజుకు కేవలం 200 రూపాయలు ఆదా చేసి… 20 సంవత్సరాలలో 14 లక్షల రూపాయలు పొందొచ్చు. ఈ ఖాతా పోస్టాఫీసులు మరియు బ్యాంకుల ఎంచుకున్న శాఖలలో 15 సంవత్సరాలు తెరుచుకోవచ్చు. దీనిని 5 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.

అలానే దీని వలన ఏ రిస్క్ ఉండదు. ఈ పథకం కింద వచ్చిన వడ్డీపై ఆదాయపు పన్ను ఉండదు. దీనికి నామినీ సౌకర్యం కూడా ఉంది. దీనిలో మీరు కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టడం అవసరం. సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే వడ్డీ రేట్లు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

ఈ పథకం కింద, రోజుకు 200 రూపాయలు ఆదా చేస్తే… ఆ డబ్బు నెలకు 6000 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మీ వార్షిక పెట్టుబడి 72,000 రూపాయలు. మీరు ఇలా 15 సంవత్సరాలు చేస్తే, మీ మొత్తం పెట్టుబడి 10,80,000 రూపాయలు. ఒకవేళ మీరు 20 సంవత్సరాల పాటు ఒకే రేటుతో వడ్డీ వస్తే అప్పుడు రాబడి రూ .14.40 లక్షలు. అంటే, మీ మొత్తం పెట్టుబడిపై 17.55 లక్షల రూపాయల వడ్డీ రూపంలో అదనంగా వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news