ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో ఉద్యోగాలు.. వివరాలివే..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ( Aeronautical Development Agency ) (ADA) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency
ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ పలు ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ పద్దతిలో ఉద్యోగులను భర్తీ చెయ్యనున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

దీనిలో మొత్తం 68 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు వున్నాయి. అప్లై చెయ్యాలని అనుకునే వాళ్లకి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ప్యాస్ అయ్యి ఉండాలి. 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఈ పోస్టులకి అర్హులు. అదే విధంగా సంబంధిత విభాగంలో అనుభవం తప్పని సరిగా ఉండాలి.

ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఇక శాలరీ గురించి చూస్తే.. రెండేళ్ల అనుభవం ఉన్న వారికి నెలకు రూ. 50,000+డియర్‌నెస్‌ అలవెన్స్, నాలుగేళ్ల అనుభవం ఉన్నవారికి రూ. 60,000+డియర్‌నెస్‌ అలవెన్స్, ఎనిమిదేళ్ల అనుభవానికి నెలకు రూ.70,000+డియర్‌నెస్‌ అలవెన్స్‌ వస్తుందని నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

షార్ట్‌లిస్టింగ్, ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ ఇంటర్వూ, ఫైనల్‌ పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చెయ్యనున్నారు. అప్లై చెయ్యడానికి జూలై 29 ఆఖరి తేదీ. పూర్తి వివరాలని ఇక్కడ చూడండి https://www.ada.gov.in/