అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలో ఉన్న అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

వేరు వేరు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఎంపికైన వారు సంవత్సరం పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి. క్లస్టర్ హెడ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది. ఇక వయసు విషయంలోకి వస్తే.. అభ్యర్థుల వయస్సు 45 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి అని నోటిఫికేషన్ లో తెలిపారు.

విద్యార్హతో లోకి వెళితే.. గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ/డిప్లొమా(అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)/ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. సంబంధిత విభాగాల లో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోచ్చు. అప్లై చేయాలనుకుంటే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. డిసెంబర్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. కనుక ఈ లోగా అప్లై చేసుకోండి. http://www.aicofindia.com/ వెబ్ సైట్ నుండి అప్లై చేసుకోచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Latest news