విశాఖ రాజధాని అయితే రాష్ట్రం బాగుపడుతుంది.– మంత్రి బుగ్గన

మూడు రాజధానుల వ్యవహారంపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. నిన్న ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ మూడు రాజధానులును రద్దు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా నేడు మండలిలో మంత్రి బుగ్గను రాజధానుల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. మండలిలో పాలన వికేంద్రీకరణ వల్ల వచ్చే లాభాలను గురించి చర్చించారు. అందిరితో చర్చించి మరింత ఆమోదయోగ్యంగా ఉండే బిల్లుతో వస్తామని స్పష్టం చేశారు.

కాగా రాజధాని విషయంపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బోస్టన్ కమిటీ, ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించిన తర్వాతే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని గతంలో నిర్ణయించినట్లు మంత్రి బుగ్గన మండలికి తెలియజేశారు. అన్ని సదుపాయాలు ఉన్న విశాఖ పట్నం రాజధాని అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ఇక శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూల్ లో హైకోర్ట్ పెట్టాలనుకున్నట్లు తెలిపారు. సమగ్ర బిల్లును తెచ్చేందుకే పాత చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు బుగ్గన వివరించారు. సంపదనంతా తీసుకువచ్చి ఒకే చోట పెడితే సమస్య వస్తుందనే వికేంద్రీకరణకు మొగ్గు చూపామన్నారు. వికేంద్రీకరణ వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివ్రుద్ది చెందుతాయని ఆయన అన్నారు.