నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు..!

-

మీరు ఏదైనా ఉద్యోగం చెయ్యాలని ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం పూర్తి వివరాలని చూస్తే.. ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్ మరియు వాచ్ మెన్ కం గార్డెనర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఆఫీస్ అటెండెంట్: 18-45 ఏళ్లు, అటెండెంట్: 18-65 ఏళ్లు, వాచ్ మెన్ కమ్ గార్డెనర్: 18-65 ఏళ్లు తప్పక ఉండాలి అని నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు జూన్ 30ని ఆఖరి తేదీ.

అయితే అభ్యర్థులు ఆ తేదీలోగా నోటిఫికేషన్లో సూచించిన చిరునామాకు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి వివరాలని చూస్తే.. ఆఫీస్ అసిస్టెంట్-3 పోస్టులు, అటెండర్ విభాగంలో 1 పోస్టు, వాచ్ మెన్ కమ్ గార్డెనర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక అర్హత విషయం లోకి వస్తే.. ఎంఎస్ ఆఫీస్, టాలీ&ఎక్సెల్ లో ప్రొఫిషియంట్ అయి ఉండాలి. స్థానిక భాషలో టైపింగ్ తప్పక రావాలి. ఇంగ్లిష్ టైపింగ్ స్కిల్ ఉన్న వారికి ప్రాధాన్యాత ఉంటుంది. అటెండెంట్ పోస్టుకి అయితే స్థానిక జిల్లాలో నివాసం ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. వాచ్ మెన్ కమ్ గార్డెనర్ పోస్టుకి అయితే స్థానిక జిల్లాలో నివాసం ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యచ్చని నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

అభ్యర్థులు బ్యాంక్ వెబ్ సైట్ లేదా కింద ఇచ్చిన లింక్స్ నుంచి అప్లికేషన్ ఫామ్ ని డౌన్ లోడ్ చేసుకుని… ఆ అప్లికేషన్ ఫామ్ ని నింపి నోటిఫికేషన్లో సూచించిన చిరునామాకు పంపాలి అంతే.  https://bankofindia.co.in/pdf/RSETIRatnagiri_19062021.pdf https://bankofindia.co.in/pdf/RSETISindhudurg_19062021.pdf

 

Read more RELATED
Recommended to you

Exit mobile version