సీ-డాక్ హైద‌రాబాద్‌లో జాబ్స్.. వివరాలివే..!

ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి గుడ్ న్యూస్. సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ హైద‌రాబాద్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుద‌ల చేసింది. ఆసక్తి , అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేష‌న్ ఆధారంగా ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, ప్రాజెక్టు ఇంజనీర్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టును భ‌ర్తీ చేయ‌నున్నారు.

 

jobs
jobs

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 5, 2021 ఆఖరి తేదీ. ఇది ఇలా ఉంటే రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రాజెక్టు మేనేజర్ 01, ప్రాజెక్టు ఇంజనీర్ 36, ప్రాజెక్టు అసోసియేట్ 01. సంబంధిత రంగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొనే అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ కోసం https://www.cdac.in/index.aspx?id=ca_advt_04_sept_2021 వెబ్‌సైట్‌ చూసి అప్లై చేసుకోచ్చు.

ఆన్‌లైన్ ఆధారంగానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే.. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇది ఇలా ఉంటే మ‌ల్టీ లెవ‌ల్ ఇంట‌ర్వ్యూ విధానం నిర్వ‌హిస్తారు. ఒక వేళ అవసరం అయితే ఎంపిక ప్ర‌క్రియ మార్చే హ‌క్కు సంస్థ‌కు ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్: https://www.cdac.in/index.aspx