మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎక్కువ స్థాయి ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోచ్చు.
దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా చదవాలి. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. శాలరీ వివరాల లోకి వెళితే.. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 జీతం లభిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2022. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూస్తే.. అధికారిక CBI వెబ్‌సైట్–www.cbi.gov.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందు CBI అధికారిక సైట్‌కి వెళ్లండి– www.cbi.gov.in .
హోమ్ పేజీలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
చిరునామా: హెడ్ ఆఫ్ జోన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కోల్‌కతా జోన్, కోల్‌కతాకు 15వ అంతస్తులో, 2వ MSO బిల్డింగ్, 234/4, AJC బోస్ రోడ్, కోల్‌కతాకు పంపించాలి. పిన్ కోడ్ – 700020.