టీఆర్‌ఎస్‌పై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..అన్ని చిల్లర రాజకీయాలే !

-

టీఆర్‌ఎస్‌పై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కావలసింది ఓపిక… ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారని అందువల్ల కార్యకర్తలు ఓపిక తో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మనలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అయితే మనం పార్టీలో ఉన్నందున ఎక్కడ తొందర పడవద్దు, మీరు ఎవ్వరిని ఇబ్బంది పెట్టవద్దనిం కార్యకర్తలను కోరారు. చిల్లర వ్యక్తుల చేసే చిల్లర కార్యక్రమాలకు స్పందించవద్దని ఎదుటి వారు చేసే చిల్లర చేష్టలను పట్టించుకోవద్దని అన్నారు.

చిల్లర వ్యక్తులను పట్టించుకుంటే మన పరువు పోతుందని తుమ్మల అన్నారు. మన ప్రజల కోసం మన పార్టీ కోసం పని చేద్దామని చెప్పారు. నేను పదవి లో వున్నప్పుడు కూడా ప్రతి పక్ష పార్టీలకు సంబంధించిన వారిపై ఎటువంటి వివక్షత చూపించలేదని ఇప్పుడు స్వంత పార్టీ వారికే వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు…

Read more RELATED
Recommended to you

Latest news