ONGC లో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలని భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

 

jobs
jobs

మొత్తం 309 పోస్టుల్ని ఇప్పుడు భర్తీ చేస్తోంది ఓఎన్‌జీసీ. పలు బ్రాంచ్‌లల్లో బీటెక్, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 1 ఆఖరి తేదీ. ఇది ఇలా ఉండగా అర్హత వివరాలని చూస్తే… సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు మాత్రమే అప్లై చేయాలి.

సంబంధిత సబ్జెక్ట్‌ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు గేట్ 2021 స్కోర్ ఉండాలి. అలానే దరఖాస్తు చేసేముందు గేట్ రిజిస్ట్రేషన నెంబర్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థులు ఓఎన్‌జీసీ అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruitment2021.ongc.co.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే vijayapatham.com వెబ్‌సైట్‌లోని ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.